రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భయపడి వెళ్లిపోయారు అనే వార్తలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీశ్ ఖండించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టడాన్ని వక్రీకరించి రాయొద్దు. కొద్దిసేపటి క్రితమే ఆయన భార్య చనిపోయారు. మేమంతా చాలా మెంటల్ స్ట్రెస్ లో ఉన్నాము. మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకుని వాస్తవాలు రాయండి. రాహుల్ భయపడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా పంపించారు అనేవి పూర్తిగా అవాస్తవాలు మాత్రం ప్రచురించకండి” అని కోస్తా జిల్లాల జైళ్ల డిఐజి రవికిరణ్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.
