డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
కొత్తపేట మండలం కొత్తపేట గ్రామంలో సత్తెమ్మ పుట్ట వీధిలో మురుగునీటి సమస్య అధికంగా ఉండి నీరు ఎటూ వెళ్ళక విష జ్వరాలు ప్రబలి ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం స్థానికులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి దగ్గరుండి మురుగునీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టి త్వరితగతిన సీసీ డ్రైన్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.ఇలాగే గతంలో ఉచ్చిలి వద్ద రైతులు మురుగునీరు సమస్యను చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకురాగా ఆర్ అండ్ బి రోడ్డుకు గండి కొట్టి రైతులు నష్టపోకుండా ఆయన చూపిన చొరవను ప్రజలు గుర్తుచేసుకున్నారు.
[zombify_post]