in , ,

స్పందనలో స్వీకరించిన అర్జీలు పరిష్కారిని అధికారులు శ్రద్ధ పెట్టండి

పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా: స్పందనలో స్వీకరించిన అర్జీలు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఓ . అభిషేక్ , డి ఆర్ ఓ పి. అంబేద్కర్ సంయుక్తంగా వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 85 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కొయ్యూరు మండలం రైతు ఉత్పతిదారుల సంఘానికి ఐతు ఉత్పత్తులు కలక్షన్ సెంటర్ నిర్మాణానికి కొయ్యూరు మండలం శరభన్న పాలెంలో 10 సెంట్ల స్థలాన్ని మంజూరు చేయాలని సంస్థ చైర్మన్ పెదరాజ బాబు, డైరెక్టర్ ఎస్. సత్యనారాయణ వినతిపత్రం సమర్పించారు. పాడేరు మండలం లగిశపల్లి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని చెట్టి క్రాంతి వినతి పత్రం సమర్పించారు.
జి.మాడుగుల మండలం చుట్టు మెట్ట గ్రామస్తుడు వంతాల కృష్ణారావు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని వినతి పత్రం అందజేసారు. హుకుంపేట మండలం మఠం పంచాయితీ ఎం. గన్నేరుపుట్టు గ్రామానికి చెందిన పొంగి క్రిష్ణ చైతన్య సికిల్ సెల్ ఎనిమియా పింఛను కోసం దరఖాస్తు చేసారు. ముంచంగి పట్టు మండలం బంగారుమెట్ట పంచాయత్ రావిడిపుట్టు గ్రామానికి తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు గుర్రం అర్జునరావు, పొంగి గురు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ డి సి వివి ఎస్ శర్మ, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, ఇ ఇలు డివి ఆర్ ఎం రాజు, కె. వేణుగోపాల్, పంచాయతీ రాజ్ ఇబ్న్ ఇటి. కొండయ్య పడాల్ , గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ ఇ లీలా క్రిష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. జమాల్ భాషా వివిద శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కలిసి పరిపాలన”

రాష్ట్రంలో జగనాసుర పాలన”