గుమ్మలక్ష్మీపురం: టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆనందం వ్యక్తమ వుతోంది. జనసేనతో కలిసి పని చేయడం వల్ల తమ బలం పెరుగుతుందని కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా పనిచేస్తే మెజార్టీ స్థానాలు దక్కించుకుంటామని టీడీపీ నాయకులు కృష్ణబాబు పేర్కొన్నారు. ఈ కలయిక వల్ల ఇరు పార్టీలకు మేలు జరుగుతుందని గుమ్మలక్ష్మీపురం జనసేన నాయ కులు మోటక మల్లేశ్వరరావు అన్నారు.
“అధికార పార్టీకో న్యాయం.. మాకో న్యాయమా?”
సాలూరు: ‘అక్రమంగా మా నాయకుడిని అరెస్టు చేసి జైల్లో పెడితే ప్రభుత్వ తీరుకు నిరసనగా మేం నిరవధిక నిరాహార దీక్షలు చేయకూడదా.. ఇదెక్కడి న్యాయం? అధికార పార్టీకి ఓ న్యాయం.. మాకో న్యాయమా.?’ అంటూ టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టి) పోలీసుల తీరుపై మండిపడ్డారు. చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా స్థానిక బోసు బొమ్మ కూడలిలో గురువారం రెండో రోజు నిరవధిక నిరాహార దీక్షలు చేసేందు కు సిద్ధమయ్యారు. దీంతో అక్కడికి చేరుకున్న పట్టణ సీఐ శ్రీనివాసరావుతో పాటు పోలీసు సిబ్బంది టీడీపీ నాయకులు నిమ్మాది తిరుపతిరావు, డబ్బి కృష్ణ, అప్పయ్యమ్మ, కనకరావు, పరమేష్, విక్రమ్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. నిమ్మాది తిరుపతిరావు మాట్లాడుతూ బోసుబొమ్మ కూడలిలో ప్రజా సమస్యలపై నిత్యం ఏదో ఒక రాజకీయ పార్టీ నిరసనలు, నిరవఽధిక దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోరని, అలాంటిది తమ నాయకుడి కోసం దీక్షలు చేస్తే అడ్డుకోవడం సరికాదని అన్నారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణంలో సెక్షన్ 30 అమలులో ఉన్నపుడు ఇలా నిరవఽధిక నిరాహార దీక్షలు చేయటం సరికాదని అన్నారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.