సిద్ధార్థ ఒకేషనల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
విద్యార్థులను వేధిస్తున్న
ఒకేషనల్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి
ప్రజాపక్షం/నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని
సిద్దార్థ ఒకేషనల్ జూనియర్ కాలేజీ యాజమాన్యం
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని, బుధ
వారం రోజున ఓ విద్యార్థిని వేధించడంతోనే స్థానిక కళా
శాల భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశా
రని, అడ్మిషన్స్ చేసుకునే ముందు మాయమాటలు చెప్పి
చేర్చుకుంటున్నారని, మెమోలు, టీసీకి వెళ్తే డబ్బులు
చెల్లిస్తే ఇస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని
విద్యార్థి వాపోయారు. మీరు ఎవరికి చెప్పుకుంటారో
చెప్పుకోండని, కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థిని బెదిరించి
ప్రజాపక్ష
నట్లు సమాచారం. ఈ విష
యంలో జిల్లా ఇంటర్మీడియట్
విద్యాశాఖ అధికారి దృష్టికి
కొందరు తీసుకువెళ్లినా కనీస
చర్యలు తీసుకోవడం లేదు.
అన్నది విద్యార్థి సంఘాల ఆరోపణ. కళాశాల యాజ
మాన్యానికి ఇంటర్మీడియట్ విద్యాధికారికి లోపాయ
కారి ఒప్పందంతోనే ఇలా జరుగుతున్నాయని అంటు
న్నారు. కళాశాలలోని తోటి విద్యార్థుల అప్రమత్తతతో
ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని కాపాడినట్లు పలు
వురు అంటున్నారు. ఇప్పటికైనా ఒకేషనల్ జూనియర్
కళాశాలపై చర్యలు తీసుకుని తగు న్యాయం చేయాలని
విద్యార్థులు కోరుతున్నారు.
[zombify_post]