ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ను అందుకుంటున్న సర్పంచ్ కారుపాకల రాజయ్య
ధర్మారం సెప్టెంబర్ 13 గురు న్యూస్ : జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును అందుకున్న కటికనపల్లి గ్రామ సర్పంచ్ కారుపాకల రాజయ్య, 2023 సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామిన్ లో భాగంగా ధర్మారం మండలంలోని కటికనపల్లి గ్రామం ఉత్తమ గ్రామపంచాయతీ గా అవార్డు రావడం జరిగింది. బుధవారం నాడు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, చేతుల మీదుగా కటికనపల్లి గ్రామ సర్పంచ్ కారుపాకుల రాజయ్య, కార్యదర్శి సమ్మయ్య, లకు ముందుగా సాల్వాతో సత్కరించి అవార్డును అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కార్పాకుల రాజయ్య మాట్లాడుతూ, తడకనపల్లి గ్రామానికి అవార్డు రావడం సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ సిబ్బంది మరియు పాలకవర్గం కృషి వల్ల స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023 సంవత్సరానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కడికనపల్లి గ్రామానికి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్లు మరియు డిఆర్డిఓ డిపిఓ ఎస్ బి ఎం అధికారులతో పాటు ధర్మారం ఎంపీడీవో భీమ జయశీల, ఎంపీఓ రమేష్, తదితరులు పాల్గొన్నారు
[zombify_post]