in ,

ఎండీ వికాస్ కన్వేల్కర్ కీలక వ్యాఖ్యలు – “

 చంద్రబాబు అరెస్టుపై డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వేల్కర్ కీలక వ్యాఖ్యలు – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు సమయంలో సీమెన్స్ సంస్థ కార్యకలాపాలను పలు సందర్భాల్లో తనిఖీ చేశాం – నిర్దేశిత లక్ష్యాలు చేరుకునేలా సీమెన్స్, మేము ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‍తో సమిష్టిగా ప్రయత్నం చేశాం –  ఆంధ్రప్రదేశ్‍లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి – మా కృషికి ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంచి అభినందన లభిస్తుందని ఆశించాం – ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు – పలు మీడియా సంస్థలు ఇన్ని వందల కోట్ల అవినీతి.. అన్ని వందల కోట్ల అవినీతి అంటూ కథనాలు ప్రచురిస్తున్నాయి – ఎవరైనా ఈ సెంటర్లలోకి ఒకసారి వెళ్లి పరిశీలిస్తే వాటి నిర్మాణానికి అయిన ఖర్చు..  శిక్షణకు అవుతున్న నిర్వహణ వ్యయం బట్టి వాస్తవం తెలుస్తుంది – నేను చేసిన పనిలో ఏమైనా లోపం ఉన్నా.. సదుపాయాల్లో ఏదైనా తప్పిదాలున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా దృష్టికి తీసుకురావాల్సింది – అగ్రిమెంట్ సైన్ చేసుకున్నప్పుడు కూడా ఆర్బిట్రేషన్ కు అవకాశం ఉండింది.. అవేవీ లేకుండానే నేరుగా కేసులు దాకా వెళ్లారు – 

ఈ కేసులో చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ చాలా లోపభూయిష్టంగా ఉంది – రూ.241 కోట్ల ప్రాడ్ జరిగిందనే ఆరోపణనను ఏ సాధారణ ఆడిటర్ పరిశీలించినా అది అవాస్తవమని తేల్చగలరు – ఏ చోట ఎన్ని కోట్ల లెక్క కావాలన్నది స్పష్టంగా చెప్తే మేము వివరణ ఇచ్చేవాళ్లం – ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నప్పుడు కానీ.. ఆ తర్వాత కానీ.. నేనెప్పుడూ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవలేదు – ముఖ్యమంత్రి కలవమంటే సంతోషంగా కలిసే వాడిని కానీ అది ఏ దశలోనూ జరగలేదు – మొత్తం ప్రాజెక్టుకైనా ఖర్చును ఎప్పుడు ఏ వేండర్‍ కి ఎంత చెల్లించాము అన్న వివరాలు ఇన్‍వాయిస్‍లతో స్పష్టంగా అందజేస్తున్నాం – వివరాలు చూస్తే ఈ ప్రాజెక్టుకు మేము రూ.356 యొక్క కోట్లు వెచ్చించాము – ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు వల్ల మాకు రూ.17.8 కోట్ల నష్టం వాటిల్లింది – ఈ వివరాలన్నీ కూడా విచారణ సంస్థలకు అందజేశాం – ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవం, ఎవరికి ఎలాంటి మొత్తము అక్రమంగా చెల్లించలేదు – సర్వీస్ టాక్స్ వ్యవస్థలో వచ్చిన మార్పుల తర్వాతే ఈ సమస్య తలెత్తింది – కాంట్రాక్ట్ ప్రారంభంలో జీఎస్టీ వ్యవస్థ లేదు అమలు దశలో మధ్యలో టాక్స్ వ్యవస్థ మారడం వల్లే గందరగోళం ఏర్పడింది – మాకు సప్లయ్ చేసిన వెండర్స్ కి మేము సర్వీస్ టాక్స్ చెల్లించాము – కానీ మా వెండర్స్ కి సరుకు ఇచ్చిన వెండర్స్.. సర్వీస్ టాక్స్ ఏ రూపంలో చెల్లించారో తెలియదు అక్కడే కొంత గందరగోళం ఏర్పడింది – దాని ఆధారంగా ఏదో అక్రమం జరిగిందని పలు కథనాలు ప్రారంభమయ్యాయి – 2018లోనే ఈ ఆరోపణలపై నేను పూర్తి వివరాలు ఇచ్చాను – ఎలాంటి షెల్ కంపెనీలు లేవు – 2017లో ఈ గందరగోళం తలెత్తితే ఇప్పటికీ ఆరేళ్లు గడుస్తున్నా టాక్స్ సంబంధిత విచారణ బృందాలు మాపై ఎలాంటి వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయలేదు – ఏ తప్పు చేయలేదు కాబట్టి మాపై ఎలాంటి వ్యతిరేక నిర్ణయం ఉండదు – నాకు చెల్లించిన ప్రతి రూపాయికి నిర్దేశిత ప్రొడక్ట్స్ సర్వీసెస్ సంపూర్ణంగా అందజేశాం – ఆ మొత్తానికి సంబంధిత టాక్స్ కూడా చట్టబద్ధంగా చెల్లించాం – చంద్రబాబు నాయుడుపై ఆరోపణ చేసేందుకు మాపై దుష్ప్రచారం చేయడం విచారకరం – ఒకరకంగా గత కొంతకాలంగా మాపై మీడియా ట్రయల్ జరుగుతోంది – బలవంతమైన వ్యక్తులు మాలాంటి చిన్న కంపెనీల బాధ్యులను అరెస్టు చేయించడం.. మాపై ఆరోపణలు గుప్పించడం మాలాంటి కంపెనీల పతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుంది – ఈ చర్యల ద్వారా మార్కెట్లో మా కంపెనీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా రేటింగ్ పడిపోతోంది – మా ఉద్యోగులు వెళ్లిపోతున్నారు, బ్యాంకులు రుణ పరపతి తగ్గిస్తున్నాయి – ఏ తప్పు చేయకుండానే కంపెనీగా మా గొంతు నొక్కడమే మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేలోగా మా కంపెనీ ప్రాణం పోతుంది దానికి బాధ్యులు ఎవరు? – ఇంత అద్భుతమైన ఫలితాలు చూపించిన తర్వాత కూడా ఏ కారణం చూపకుండానే మాపై ఈ రకమైన కక్ష సాధింపు బాధాకరం – డొల్ల ఆరోపణలు చేస్తూ.. గత ప్రభుత్వానికో కొందరు వ్యక్తులకు లబ్ది చేకూర్చామని అసత్య ఆరోపణలు చేస్తూ మమ్మల్ని శిక్షించడం సరికాదు – చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు ఆయన అరెస్టు అంశంపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు – ఎవర్ని నిందించగలను.. కానీ జరుగుతున్న పరిణామాలన్ని చాలా విచారకరం – అంకెలను సరితూచి చూస్తే ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని స్పష్టంగా తెలుస్తుంది – ఈ తరహా పరిణామాలేవి జరగకుండా ఉండాల్సింది – వాటి ద్వారా ఓ పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండగలరేమో దానిపై నేనేమీ మాట్లాడలేను – ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నా.. మేము స్థాపించిన సెంటర్లను సమర్థవంతంగా నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తద్వారా ఇతర రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి – వాటి ద్వారా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం వారికి చెప్పగలను : డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వేల్కర్

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

పథకాలు ప్రజలకు సక్రమంగా అందించేలా అధికారులు పనిచేయాలి

దాతృత్వాన్ని చాటుకున్న ఉపాధ్యాయుడు