in

టీడీపీ అధినేత చంద్రబాబు కి జైలా లేక ..హౌస్ రిమాండా? ఇవాళ తేల్చనున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ..  ట్విస్టులు, మీద  ట్విస్టులు …ఎత్తుగడలతో  ముందుకెళ్తోందా? చదరంగం లో నువ్వా నేనా అన్నట్టు ..ఇరు పక్షాల లాయర్లు వ్యూహాలు రచిస్తున్నారా? మరి ఇవాళ ఏం జరుగుతుంది? టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ*

గత మూడు  రోజులుగా పక్క రాష్ట్రాలలో ఈ  వార్తలే హైలెట్ అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్. ఐతే.. ఈ హైప్‌ని కొనసాగిస్తూ..

విజయవాడ ఏసీబీ కోర్టులో వేస్తున్న పిటిషన్లు.. ఈ ఎపిసోడ్‌ని ట్విస్టులతో ముందుకు సాగేలా చేస్తున్నాయి. నిన్నంతా ఒకటే పిటిషన్లు. చివరకు వరుస పిటిషన్లతో ఓ దశలో జడ్జి కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ ఏం జరుగుతుందో అంత ఉత్కంఠ…

చంద్రబాబుకి రాజమండ్రి సెంట్రల్ జైలులో తగిన సెక్యూరిటీ లేదనీ, ఆయనకు ప్రాణహాని ఉందనీ.. ఆయనకు జైల్లో కాకుండా.. హౌస్ రిమాండ్ విధించాలని కోరుతూ.. ఆయన తరపు లాయర్ సిద్ధార్థ్ లూత్రా పిటిషన్ వేశారు. దీనిపై నిన్న లోతుగానే వాదనలు జరిగాయి. ప్రధానంగా గౌతమ్‌ నవ్‌లఖా కేసులో సుప్రీంకోర్టు మే 12, 2021న ఇచ్చిన తీర్పును సిద్ధార్థ్ లూత్రా ఉదాహరణగా ప్రస్తావించారు.

సిద్ధార్థ్ లూత్రా వాదన:

సెక్షన్‌ 167 కింద ఇలాంటి కేసుల్లో హౌస్‌ రిమాండ్‌కు ఆదేశించే అధికారం కోర్టులకు ఉంటుందని గౌతమ్‌ నవ్‌లఖా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని లూత్రా తెలిపారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, నిందితుడి పూర్వ చరిత్ర, నేర స్వభావం ఆధారంగా న్యాయస్థానాలు నిర్ణయం తీసుకోవచ్చని గౌతమ్‌ నవ్‌లాఖా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు.

పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన:

నవలౌక  కేసు తీర్పు చంద్రబాబు కి వర్తించదు …చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి, ఆయనకు హౌస్ రిమాండ్ అవసరం లేదు, పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రత చాలా బాగుంది, హౌస్ కంటే జైలులోనే భద్రత ఎక్కువగా ఉంటుంది అని సీఐడీ తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.

న్యాయమూర్తి ఏమన్నారు?

రెండువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఎవరికి వారు వాదనల్ని బలంగానే వినిపించారు. దానికి తోడు మిగతా మరిన్ని పిటిషన్లు తెరపైకి వచ్చాయి. అలాగే ఇతర కేసుల వాదనలు కూడా ఉన్నాయి. అందువల్ల న్యాయమూర్తి దీనిపై ఇవాళ తీర్పు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Allagadda CM news

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

పాడేరు ఘాట్ లో అల్లుకున్న పొగమంచు: వాహనదారులు ఇబ్బందులు

బ్రేకింగ్ న్యూస్