చంద్రబాబు కేసులో తీర్పు రిజర్వ్
చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. స్కిల్ స్కాం కేసులో ఆదివారం ఉదయం నుంచి ఇరు పక్షాలు సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. దాదాపు ఏడున్నర గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ తమ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కాగా తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
[zombify_post]