తంగుడిబిల్లిలో పొలంబడి
నెల్లిమర్ల మండలం తంగుడిబిల్లిలో శుక్రవారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఎం పూర్ణిమ వరిపంటలో పిలకలు, ఆకుల కత్తిరింపులు, పిలకలు వచ్చే సమయంలో నీరు పెట్టే విధానం గురించి రైతులకు వివరించారు. శత్రు, మిత్ర పురుగులు పొలం పరిసరాల విశ్లేషణ, కాలిబాటలు గురించి అవగాహన కల్పించారు. సేంద్రీయ ఎరువులు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎఇఒ నాగరాజు, విఏఏ శివ పాల్గొన్నారు.
[zombify_post]