హైదరాబాద్:సెప్టెంబర్ 08 గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఈ రోజు జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టకిల్ ఈవెంట్ కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి గంటల నుంచి రాత్రి 11 వరకు గచ్చిబౌలి నుంచి హెచ్‌సీయూ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
ఈ మేరకు ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి హెచ్‌సీయూ వైపు ప్రయాణించే వాహనదారులు, కొండాపూర్ మార్గము నుంచి వెళ్లాలని సూచించారు.
మరోవైపు నల్లగండ్ల నుంచి గచ్చిబౌలి జంక్షన్ వచ్చే వాహనదారులు మసీద్ బండ- కొండాపూర్- బొటానికల్ గార్డెన్ మీద నుంచి వాహనదారులు వెళ్లాలని కోరారు..
[zombify_post]