కర్నూలు జిల్లా ఆదోని లో తెదేపా ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.మండగిరి 20వ వార్డులో భవిష్యత్తుకు -బాబు షూరిటీ లో భాగంగా ప్రజా వేదిక కార్యక్రమంలో జరిగింది.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టో ప్రజలకు వివరించారు.’మహాశక్తి’ పేరుతో ఆడబిడ్డ నిధి ద్వారా 18 పైబడి 60 సంవత్సరాలలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం,తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి రూ.15,000 ,ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం,ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల ఇస్తామని తెలిపారు.పేదలకు మంచి జరిగేలా చంద్రబాబు చాలా పథకాలు అమలు అయ్యేలా కృషి చేస్తాడని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తెలిపారు.
[zombify_post]