సోంపేట మండలంలోని లక్కవరం గ్రామ సమీపంలో బుధవారం ముందు వెళుతున్న ఆటోను వెనక నుండి ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.స్థానిక ప్రజలు ఆస్పత్రికి చేర్చగా వైద్యం అందిస్తున్నారు ప్రయాణికులులో ఇద్దరు విద్యార్థులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలంలో బస్సును విడిచిపెట్టి ఆర్టీసీ డ్రైవర్ పరారయ్యాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
[zombify_post]