దేశంలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ''ఒకే దేశం- ఒకే ఎన్నికలు'' సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..
ఇందులో 8 మంది సభ్యులను నియమించింది. అయితే ఈ కమిటీ తొలి భేటీ మొదటి అధికారిక సమావేశం ఈరోజు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుందని సమాచారం. సార్వత్రిక ఎన్నికలు ముందే జరుగుతాయనే ఊహాగానాలు మధ్య కేంద్రం చర్యలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి..
[zombify_post]