నందిగామ, సెప్టెంబర్ 3, గురు న్యూస్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఒక వైసీపీ నేతకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతల బృందంతో కలిసి నల్లటి వస్త్రాలను పట్టుకుని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తన కార్యాలయం నుంచి పాదయాత్రగా నందిగామ గాంధీ సెంటర్ చేరుకుని ఎన్టీఆర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ ఒక వైసీపీ నాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.ఈ రోజు ఈ లోకల్ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ విగ్రహాలని చెప్పి అబద్ధపు రాజకీయాలు ఈరోజు నందిగా టౌన్ లో ఏ విధంగా నడుపుతున్నారో మనం చూశాం.గతంలో ఇక్కడ ఉన్న జాతీయ నాయకులు,రాష్ట్ర నాయకుల విగ్రహాలన్నీ ట్రాఫిక్ కు అడ్డం. రాజశేఖర్ రెడ్డి విగ్రహం మాత్రం ట్రాఫిక్కు అడ్డం లేదని చెబుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు.భవిష్యత్తు రోజులలో మీ తల్లిదండ్రుల విగ్రహాలను కూడా అలానే ఏర్పాటు చేసుకోండనే మేము డిమాండ్ చేస్తున్నాము.విగ్రహాలు తీయడం ఏ విధంగా తీశారు విగ్రహాలు పెట్టడం ఏ విధంగా పెట్టారు ఈ రెండు విషయాలను మేము పూర్తిగా ఖండిస్తున్నాము.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీర్తిశేషులు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని పెట్టడానికి కావలసింది వైసీపీ నాయకులు కావాలా.అంగడాల పూర్ణ ఎవరు కమిషనర్ కి ఏ హక్కు ఉంది.నందిగామను పశువుల కొట్టం చేస్తున్నాడు.అతనికి ఏ హక్కు ఉంది ఇక్కడ ఇన్చార్జి ఉన్నారు పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నారు.ఏ హక్కు ఉందని ఆయనకు ఇచ్చారు. విగ్రహాల కమిటీలో శాఖమూరి వంశీ , శాఖమూరి స్వర్ణలత దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు వీళ్ళు ఎవరు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.ఈ రోజు మా విగ్రహాల పట్ల మీరు ప్రవర్తించిన తీరు అంతకు పదిరెట్లు మీ విగ్రహాల పట్ల మేము ప్రవర్తిస్తామని హెచ్చరిస్తున్నాం.పశువుల డాక్టర్ కమీషనర్ తన బుద్ధిని చూపిస్తున్నాడు. ఒక కమిషనర్ చెప్తే పరిపాలన జరుగుతుందా ఇక్కడ అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నాడు.కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దానికి అనుగుణంగా విగ్రహాల ప్రతిష్ట జరగాలి. విగ్రహాలు పెట్టుకోవచ్చు అని కోర్టు ఇచ్చిన తీర్పు ఉంటే అది చూపించి విగ్రహాలను పెట్టండి.ఇది మా నాయకుడికి మాకు జరిగిన అవమానంగా భావిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]