in ,

లక్షితపై దాడి చేసిన చిరుత జాడేది?..అటవీ శాఖకు సవాలుగా మారినసమస్య

లక్షితపై దాడి చేసిన చిరుత జాడేది?.. అటవీ శాఖకు సవాలుగా మారిన సమస్య*

*తిరుపతి, తిరుమల నడక మార్గాల్లో చిరుతల భయం భక్తులను వీడేలా లేదు. అలిపిరి నడక మార్గంలో చిరుతల అలజడిపై కొనసాగుతున్న నిఘా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈనెల 24, 25 న అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు చిరుతలు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరా ఇమేజెస్ బయటపెట్టాయి. నడక మార్గానికి దగ్గరగానే చిరుతలు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరా లో కనిపించిన చిరుతలు చాలా చోట్ల సందడి చేశాయి. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల లోపు చిరుతలు సంచరిస్తూ ట్రాక్ కెమెరాల్లో చాలా చోట్లనే కనిపించాయి. దీంతో టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. నడక మార్గంలో వచ్చే భక్తులను తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తోంది. మరోవైపు రెండు నడక మార్గాల్లో ఆంక్షలను యధావిధిగానే అమలు చేస్తుంది. అయితే గత ఆగస్టు 11న లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను ఇప్పటిదాకా అటివిశాఖ గుర్తించలేక పోతోంది.

నడక మార్గంలో ఆపరేషన్ కంటిన్యూ చేసి ఇప్పటిదాకా 6 చిరుతలను బంధించిన అటవీశాఖ బంధించిన 6 చిరుతల్లో రెండు చిరుతలు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టింది. ఒక చిరుతను తలకోన అటవీ ప్రాంతంలో మరో చిరుతను గుండ్ల బ్రహ్మేశ్వరం అడివి ప్రాంతంలో వదిలిపెట్టిన అటవీశాఖ ఒక చిరుతను విశాఖ జూకు తరలించి విముక్తి కల్పించింది. ప్రస్తుతం తిరుపతి జూ లో ఉన్న మూడు చిరుతల్లో రెండు చిరుతలకు కొరపళ్లు లేకపోవడంతో జూ లో ఉంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. మరో చిరుత ను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే జూలో ఉన్న మూడు చిరుతల్లో లక్షితపై దాడి చేసిన చిరుత ఉందేమోనన్న అనుమానంతో నమూనాలు సేకరించి పరీక్షలకు పంపింది.

ఇప్పటిదాకా రాని రిపోర్ట్ లుతో పరేషాన్ అవుతున్న అటవీశాఖ లక్షితపై దాడి చేసిన చిరుతను నిర్ధారించలేకపోతోంది. తిరుపతి జూలోనే ఉన్న మూడు చిరుతలను ఉంచి వాటి ఆలనా పాలనా చూస్తోంది. అయితే గత వారం రోజులుగా నడకమార్గానికి దగ్గర్లోనే సంచరిస్తున్న చిరుతలు, ఎలుగుబంట్లు పై నిఘా పెంచిన అటవీశాఖ సిబ్బంది ట్రాప్ కెమెరాల్లో లభించిన ఇమేజెస్ ద్వారా చిరుతల కదలికలు గుర్తించే పనిలో ఉంది. ఆయా లొకేషన్లలో బోన్లు ఏర్పాటు చేసింది. అందుబాటులో ఉన్న 10 బోన్లను సిద్దంగా ఉంచుకున్న అటవీ శాఖ నడక మార్గంలో చిరుతల సంచారం పై క్లోజ్ గా మానిటరింగ్ చేస్తోంది. నడకమార్గానికి ఇరువైపులా 200 వందల మీటర్ల దాకా నిఘా కొనసాగిస్తోంది. నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కూడా హెచ్చరిస్తోంది. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గాల్లో యధావిధిగానే ఆంక్షలను టీటీడీ అమలు చేస్తోంది.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

జెడ్పీ స్కూల్ లో నూతన నిర్మాణాలకు శంకుస్ధాపన చేసిన హోంమంత్రి

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి:JAAP(జాప్)