డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ప్రచారం చాప కింద నీరులా దూసుకెళ్తుంది. దీంతో ప్రతిరోజూ ఏదో సమయంలో ప్రతి గ్రామంలో ప్రచారాలు మరియు నూతన సభ్యుల చేరికలతో రోజు రోజుకీ దూసుకుపోతున్నారు. ఇక నుండి బీఎస్పీ గెలుపే ధ్యేయంగా ప్రచారానికి మరింత పదును పెట్టనున్నది. గత ఏడాది కాలంగా బీఎస్పీ కేడర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు సార్లు బీఎస్పీ ప్రధాన కేడర్ పర్యటనలలో రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కొత్తపేట లో నీలి జెండాను ఎగురవేస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు.
బహుజనుల ఓట్లు బీఎస్పీకి బలం:
బహుజన సమాజ్ పార్టీ పుట్టుకనే ఎస్సీ, ఎస్టీ ,బహుజనుల కోసం అనేది తెలిసిందే. కొత్తపేట నియోజకవర్గం జనరల్ స్థానం అవ్వడంతో సీటు ఎవరికి ఇచ్చిన విజయం తథ్యం అంటున్నారు బీఎస్పీ నాయకులు. కొత్తపేట నియోజకవర్గంలో ఎస్సి ,ఎస్టి ,బీసీ ,మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఇప్పటికే కొత్తపేట నియోజకవర్గంలోనీ చదువుకున్న ఎస్సిలు బీఎస్పీ విజన్ పట్ల ఆకర్షితులై బీఎస్పీ వెనక నడుస్తూన్నారు అనడానికి నిదర్శనం ప్రతిరోజూ ఎంతో కొంతమంది బీఎస్పీ పార్టీ లో చేరడమే . ఇప్పుడు బీసీ సామాజిక వర్గం సగానికి పైగా బీఎస్పీ వెనక కూడా వారు నడవనున్నారు అని వినికిడి. ఓసి సామాజిక వర్గం పైన కూడా బీఎస్పీ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు ఓట్లు గెలుపు ఓటముల శాసించగల కాపు వర్గం బీఎస్పీ వెనక నడిచేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు బీఎస్పీ నియోజకవర్గ నాయకులు.
చాప కింద నీరులా ప్రచారం..
కొత్తపేట నియోజకవర్గంలో బీఎస్పీ ప్రచారం చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో బీఎస్పీ ప్రధాన కేడర్ దాదాపు అన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడ అనేక వర్గాలను కలిసి వారి నుండి మాట తీసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ప్రచారంలో ఎక్కడ హంగు ఆర్భాటాలకు పోకుండా చాలా బ్యాలెన్స్ గా సాగిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ జెండాను కొత్తపేట లో ఎగరేసెలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరో వైపు జనసేన టీడీపీ ఏకకం కావడం తో ఈ రెండు పార్టీల కింద కేడర్ కొంత ఇబ్బంది పడుతున్నారు అని ప్రచారం ఉండడంతో ఆ కేడర్ ను బీఎస్పీ వైపు లకొడనికి కొత్తపేట నియోజకవర్గం కేడర్ అనేక ప్రయత్నాలు చేసి వారినుంచి లోపకర చర్చలు జరిపి బీఎస్పీ లో కుల మత బేధాలు లేవు అందరము అన్నదమ్ముల కలిసి హెచ్చు తగ్గులు లేకుండా ముందుకు సాగుదాం అనే నినాదం వారిలో నింపి ముందుకు సాగుతుంది బీఎస్పీ పార్టీ కేడర్.ఇప్పటికే అధికార పార్టీ లో సామాజిక వర్గాల వారితో చర్చలు సఫలం అవ్వినట్లు వినికిడి.ఏది ఏమైనా ఈ ఎన్నికలలో తమ దైన స్థాయిలో పలితాలు ఉంటాయి అని బీఎస్పీ పార్టీ నాయకులు ధీమా వ్యక్తంచేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!