in , ,

9 తేది లోపు చంద్రబాబు బయటకు వస్తారు

ఈనెల 9 లోపు చంద్రబాబు బయటకు వస్తారని యోచిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుతో నేను, రిలే నిరాహారదీక్షలు ఈనెల 9 వరకూ కొనసాగుతాయి అని ప్రకటించారు. 10 నుంచి వివిధ రూపాల్లో నిరసనలకు కొత్త కార్యక్రమం చేపడతాం అని వెల్లడించారు. కోర్టు పరిణామాలు చూసి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను నిర్ణయిస్తాం అని అచ్చెన్నాయుడు తెలిపారు. జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలో ప్రకటిస్తాం అని తెలిపారు. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నాం.. వామపక్ష పార్టీలతో పొత్తు అంశం చంద్రబాబు నిర్ణయిస్తారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.ప్రభుత్వం కక్షసాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోందన్నది స్పష్టమైంది అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలని జగన్ తాపత్రయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హడావుడిగా రేపు జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అని అచ్చెన్నాయుడు విమర్శించారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

ప్రజాక్షేత్రంలో టిడిపిని ఎదుర్కోవటం చేతకాకే తప్పుడు కేసులు

ఆ దృష్ట సంస్కృతికి బీజం పోసింది రోజునే… వంగలపూడి అనిత