in ,

పసి పిల్లాడిని వికలాంగుడు కాకుండా కాపాడిన అత్యాధునిక వైద్యం…

* మైక్రో సర్కులర్ విధానంతో ప్రత్యేక సర్జరీ

* సర్జరీ విజయవంతం కావడంతో  ఆనందం వ్యక్తం చేసిన బాదితుడి కుటుంబ సభ్యులు

* సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చిన్నగుండవెళ్లి వాసికి అరుదైన వైద్య చికిత్స

సిద్దిపేట: సైకిల్ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో పాటు  చేయి  విరిగిపోవడంతో ..నరాలు కూడా తెగిపోయాయి.. ఇక చేతిని తొలగించడం ఖాయం అనుకున్న సందర్భంగా.. ఆపదలో అపన్నహస్తం అందించి..అత్యాధునిక వైద్యం అందించి చేతిని కాపాడారు సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రి వైద్య బృందం..మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి డాక్టర్ లు మనీష్ జైన్, శ్రీనివాస్ వివరాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి గ్రామానికి  కి చెందిన ఉడుత మల్లేశం కుమారుడు రాంచరణ్  (13) సైకిల్ మీది నుండి ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా సిద్దిపేట లోని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు శ్రీనివాస్ దగ్గరికి తీసుకెళ్లారు..ఈ ప్రమాదంలో ఎడమ చేయి విరిగిపోగా, నరాలు తెగిపోవడంతో రక్తం గడ్డ కట్టిన విషయాన్ని వైద్యులు గుర్తించారు.. చేతిని తొలగించే ప్రమాదం ఉందని, వెంటనే అత్యాధునిక చికిత్స కోసం సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి వెళ్లాలని తెలపడంతో వారు ఆసుపత్రికి వెళ్లడం  జరిగింది..ఆసుపత్రిలో ని ఆర్థోపెడిక్ టీమ్, వాస్క్యులర్ టీమ్ వెంటనే స్పందించి..సీటీ అంజియో ద్వారా పరీక్షలు నిర్వహించి, సమస్యను గుర్తించారు..వైద్యులు పూర్ణచంద్ర తేజస్వి, మనిష్ కుమార్ జైన్, ప్రభాకర్ ల నేతృత్వంలోని వైద్య బృందం  రెండు గంటల పాటు శ్రమించి రక్త నాలాలను అతికించే విధానంతో సరి చేసి, చేతిని అతికించి కాపాడారు..సకాలంలో సమస్యను  గుర్తించక పోతే రాంచరణ్ చేతి తొలగించే పరిస్థితి ఉండేదని వైద్యులు తెలిపారు. రాంచరణ్ నిరుపేద కుటుంబం కావడంతో తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం జరిగిందన్నారు. అత్యాధునిక వైద్యంతో తన కుమారుని చేతిని కాపాడిన యశోదా ఆసుపత్రి వైద్య బృందం కు రాంచరణ్ తండ్రి ఉడుత మల్లేశం కృతజ్ఞతలు తెలిపారు..సమావేశంలో యశోద ఆసుపత్రి ప్రతినిధులు నరేందర్ మోర, రాజిరెడ్డి లు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Sajid

Trending Posts
Top Author
Creating Memes

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధర్మపురి పర్యటనకు తరలిన నాయకులు

తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన