ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి పాలన మొదలు పెట్టేందుకు ఆమోదం తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు, భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లులకు మంత్రి మండలి అంగీకరించింది. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీలో 49 అంశాలపై చర్చ జరిగింది.