గడచిన రెండు నెలలుగా మున్సిపల్ కుళాయిల నుండి బురద నీరు వస్తుండటంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సత్వరమే సమస్య పరిష్కరించి మంచినీరు అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కె. దయానంద్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్. శ్రీరాములు నాయుడును కోరారు. బుధవారం కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. పన్నులు కడుతున్న ప్రజలకు కనీసం మంచినీరు కూడా అందించలేకపోవడం బాధాకరమని అన్నారు.
[zombify_post]