in

రేపు తేలనున్న చంద్రబాబు కస్టడీ తీర్పు

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై బుధవారం వాడిగా, వేడిగా వాదనలు జరిగాయి. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, చంద్రబాబు తరుపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం రేపు ఉదయం గం.11.30కు తీర్పు వెలువరిస్తానని తెలిపింది. చంద్రబాబును పూర్తి ఆధారాలతో అరెస్ట్‌ చేశామని, ఆయనను విచారించడం కోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వాదనలు వినిపించింది. అయితే ఆయనను సిట్‌ కార్యాలయంలోనే విచారించారని, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్‌ చేశారని, కాబట్టి కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలని సిద్ధార్థ లూద్రా కోర్టును కోరారు.

[zombify_post]

Report

What do you think?

సమస్యలు తక్షణం పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం

రైవాడ కెనాల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి…జెడ్పీటీసీ అనురాధ