ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు స్థానిక ఆదోని బీమా సర్కిల్ నందు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో 5వ రోజు నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. సోమవారం దీక్షలో కూర్చున్న వారు ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు వి మణికంఠ మాదిగ, జి ప్రభాకర్ మాదిగ, వి ఆనంద్ గిరి, హరి మాదిగ, దీక్షను ప్రారంభించిన బండారి హనుమంతు మాదిగ, ఎం ఎస్ పి జిల్లా కోకన్వీనర్ పిఎస్ వీరేష్ మాదిగ, జిల్లా నాయకులు ఎమ్మార్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు మాదాస్ జగన్ మాదిగ ఉసేనప్ప మాదిగ అంజనప్ప, ఎమ్మార్పీఎస్ నిర్వహిస్తున్న నిరసన దీక్షలకు మాదిగ లాయర్స్ ఫారం జిల్లా అధికార ప్రతినిధి బండారు నెట్టేకంటయ్య గారు,డివిజన్ అధ్యక్షులు యన్ రామాంజనేయులు గారు, ఆర్మీ ఈరన్న ,ఎంఎం కాలనీ వారి బృందం సంఘీభావాన్ని తెలుపుతూ గత 29 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ లక్ష సాధన కోసం అలు పెరుగని పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తామని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పార్లమెంటు అత్యవసర సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదముద్రవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో, ఎం ఎస్ పి జిల్లా నాయకులు ఎస్ బాలన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి టి ఈరన్న మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]