కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు అశోక్ గజపతి రాజు . ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా….అది క్యాబినెట్ మొత్తం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. అది పరిగణలోకి తీసుకోకుండా, ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టి సాక్ష్యాలు కోసం వెతుకుతున్నారని పేర్కొన్నారు. తాను న్యాయవాదిని కాకపోయినా, సుదీర్ఘ కాలంగా చట్టసభల్లో పని చేసిన వ్యక్తిని అని వెల్లడించారు.