in

ఇబ్బందులు తలెత్తకుండా చవితి వేడుకలు నిర్వహించాలి

రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చవితి పందిళ్ల నిర్వాహక కమిటీ సభ్యులతో చింతలపూడి పోలీస్‌ స్టేషన్‌ లో సీఐ మల్లేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ పలు సూచనలు, సలహాలను కమిటీ సభ్యులకు అందజేశారు. వినాయక చవితి ఉత్సవాలు జరిపే కమిటీలు ట్రాఫిక్‌కి అంతరాయం కల్గించకుండా చూడాలన్నారు. పందిళ్ల వద్ద విద్యుత్‌ తీగలు ఎటువంటి అపాయం జరగకుండా రక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్‌ శాఖ అనుమతులు పొంది లైటింగ్‌లు పెట్టుకోవాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే మైక్‌ సైండ్‌ బాక్సులు వినియోగించుకోవాలన్నారు. చవితి వేడుకల్లో అసాంఘిక కార్యకలపాలు నిర్వహించరాదని సీఐ సూచించారు. ఎస్సై ప్రసాద్‌ పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న శేషుబాబు

బద్రీనాథ్ యాత్ర ఏలూరు జిల్లా కి చెందిన మహిళ మృతి