-
ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడిగా అవార్డ్..
-
‘సైమా 2023’ వేడుకల్లో తారక్…
తెలుగుతోపాటు… తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన సీనితారలు హాజరయ్యారు. సైమా 2023 అవార్డ్స్ వేడుకలలో అత్యుత్తమ చిత్రాలు, బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన నటీనటులను గౌరవిస్తూ అవార్డ్స్ ప్రదానం చేస్తారు. ఈ వేడుకలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కొమురం భీమ్ పాత్రకు గానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు.
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (SIIMA 2023) అవార్డ్స్ శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలుగుతోపాటు… తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన సీనితారలు హాజరయ్యారు. సైమా 2023 అవార్డ్స్ వేడుకలలో అత్యుత్తమ చిత్రాలు, బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన నటీనటులను గౌరవిస్తూ అవార్డ్స్ ప్రదానం చేస్తారు. ఈ వేడుకలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కొమురం భీమ్ పాత్రకు గానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు.
ఈ అవార్డ్ కోసం తెలుగులో ఎన్టీఆర్‌తోపాటు.. అడివి శేష్ (మేజర్), దుల్కర్ సల్మాన్ (సీతారామం), రామ్ చరణ్ (ఆర్ఆర్ఆర్), నిఖిల్ (కార్తికేయ 2), సిద్ధు జొన్నలగడ్డ (డీజే టిల్లు) పోటి పడ్డారు. ఇందులో బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ అందుకున్నారు తారక్. బ్లాక్ సూట్లో తారక్ అవార్డ్ అందుకుంటున్న ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సెన్సెషన్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్ర పోషించగా.. అజయ్ దేవగణ్, శ్రియా, అలియా భట్, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.
[zombify_post]