భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో అశ్వయుజ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అక్టోబరు, నవంబరు మాసాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఈరమాదేవి శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. వైదిక పెద్దల సూచన మేరకు ఏ రోజున ఏ ఉత్సవం చేయనున్నారో వివరాలను వెల్లడించారు. అక్టోబరు 15 నుంచి 23 వరకు విజయ దశమి శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఆ రోజుల్లో అమ్మవారు రోజుకోరూపంలో దర్శనమిస్తారు. 15న ఆదిలక్ష్మి అలంకారం, 16న సంతాన లక్ష్మి, 17న గజలక్ష్మి, 18న ధనలక్ష్మి, 19నధాన్యలక్ష్మి, 20న విజయలక్ష్మి, 21న ఐశ్వర్యలక్ష్మి, 22న వీరలక్ష్మి, 23నమహాలక్ష్మి అలంకారంలో దర్శనం ఉంటుంది. 24న విజయ దశమికి ప్రత్యేక పూజలు చేస్తారు.
[zombify_post]