పార్వతీపురంటౌన్: పోటీ పరీక్షలకు వెళ్లే నిరుద్యోగ యువతకు శ్రీవాసవీ ఆర్యవైశ్య సంఘం, నోబుల్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని వాకర్స్ ఇంటర్నేషనల్ ఏరియా ఉపాధ్యక్షుడు ఐ.గున్నేష్ గురువారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం పట్టణం, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకు గ్రూపు1, 2లతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ పోటీ పరీక్షలకు ఉత్తమ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈనెల 17వ తేదీ ఆదివారం పట్టణంలోని శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఉదయం 9 గంటల నుంచి పట్టణ పోలీసుస్టేషన్లోని శ్రీవాసవీ ఆర్యవైశ్య యిండుపూరు వెంకటరావు, కల్యాణ వేదికలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 9440114225, 9441416275లను సంప్రదించాలన్నారు.
[zombify_post]