డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
రాష్ట్రంలో డిగ్రీ విద్యలో నూతనంగా ప్రవేశపెట్టిన హానర్స్ కోర్సులలో ఎక్కువ ప్రవేశాలు లేవు అనే సాకుతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొన్ని కోర్సులు ఎత్తివేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ మదన్ గుంజా ప్రశ్నించారు.ఎదైనా నూతన కోర్సులు ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని వాటిని అధిమించగలిగితేనే కోర్సులు ప్రవేశపెట్టాలే తప్పా కోర్సులు ప్రవేశపెట్టి ఎక్కువ మంది విద్యార్థులు లేక కోర్సు తీసీవేస్తే మరి జాయిన్ అయిన విద్యార్థుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు.నూతనంగా వచ్చిన హానర్స్ విధానం గందరగోళంగా ఉండడంతో ప్రవేశాలు తగ్గనప్పటికి అసలు జాయిన అయిన విద్యార్థుల గురించి ఆలోచించాలని అన్నారు.విధ్యార్ధులను బలవంతంగా కళాశాలలు మార్చడం , గ్రూపులు మర్చివేయడం , ఇక్కడ ఉన్న గ్రూపులు ఎత్తివేయడం చేస్తే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.కె.వి.శ్రీనువాసురావుకు వినతిపత్రం సమర్పించారు.ఈకార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ మదన్ గుంజా , మండలం కార్యదర్శి వెలుమూరి హెమంత్ కుమార్ , డి.కిషోర్ , కె.ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]