పాలకొండ పట్టణంలోని డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు బుధవారం అగ్ని ప్రమాద నివారణ చర్యలపై అవగాహనకల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ మార్గాలపై అవగాహన కల్పిస్తూ, అగ్నిమాపక పరికరాలను ఉపయోగించే విధానాన్ని చూపించారు. ఈకార్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
[zombify_post]