in , ,

ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి

  • ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు ను వినియోగించుకోవాలి..

  • గుర్తింపు కార్డులు జారీ..

  • –జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్.

ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐసిడిఎస్  ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ యస్ .వెంకట్ రావు మాట్లాడుతూ జిల్లా లో ఉన్న ట్రాన్స్ జెండర్స్ అందరు కూడా ఓటు హక్కు ని వినియోగించుకోవాలని  తెలిపారు. ఓటు హక్కు లేని వారు నమోదు చేసుకోవాలని అలాగే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందన్నారు, ట్రాన్స్ జెండర్స్ కి షెల్టర్ ఏర్పాటు చేయటం కోసం ప్రతిపాదనలు పంపిస్తామని  అన్నారు. ఈ సమావేశం లో జిల్లా లో ఉన్న ట్రాన్స్ జెండర్స్ కి గుర్తింపు కార్డులు అందించారు. ట్రాన్స్ జెండర్స్ గుర్తింపు కార్డు లేని వారు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి , జడ్పి సీఈఓ సురేష్ , జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ,  కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

దురలవాట్లుకు దూరంగా ఉండాలి*”

ఘనంగా స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలు*