జగన్ ఏ పని చేశాడో ఎవరికి తెలియదన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సడన్‌గా జగన్ ఆస్తులు పెరిగిపోయాయని ఆరోపించారు. చంద్రబాబుకు నా మద్దతు..ఇప్పుడు రేపు కూడా ఉంటుందన్నారు. అందరిని నేరగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య సృష్టించింది వైసీపీనే అన్నారు జనసేనాని. ప్రజల్ని భయబ్రాంతుల్ని చేసి.. ఎవరికి నోరులేకుండా చేస్తున్నారు. ఎవరు ఎదురు చెప్పి మాట్లాడకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ రోజున వైసీపీ చేస్తున్న పనులు ప్రతిపక్షాలకు బలం ఇస్తున్నాయన్నారు పవన్. వైసీపీకి ఎవరు ఇక్కడ భయపడరు… ఇంకా బలపడతారు అన్నారు.
బెయిల్ పై బయటకు వచ్చిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చట్టాలు నిజంగా పనిచేస్తే.. జగన్ సీఎం కాలేడన్నారు పవన్ కళ్యాణ్ . పోలీస్ వ్యవస్థను నీర్వీర్యం చేశారన్నారు. దివ్యాంగుల్ని కూడా బెదరిస్తున్నారన్నారు.
మరోవైపు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు జ్యూడీషియల్ రిమాండ్‌కు చంద్రబాబును తరలించనున్నారు. సీఐడీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. గవర్నర్ పర్మిషన్ పై కోర్టు ఏకీభవించలేదన్నారు. స్కాం జరిగిందని ఆధారాలు ఉన్నాయన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చెయ్యడంపై ఉదయం 9 గంటల నుంచి విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వాడివేడిగా సాగాయి. మధ్యలో ఉదయం 10.30కి చిన్న బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ 11 గంటలకు వాదనలు కొనసాగాయి. మళ్లీ 12 గంటలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ 1.30కి వాదనలు మొదలయ్యాయి. సీఐడీ తరపు ఏఏజీ పొన్నవోలు తన వాదనను వినిపించారు. చంద్రబాబు తరపున సుప్రీ కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బలంగా వాదనలు వినిపంచారు.
[zombify_post]