in , ,

సూర్యాపేటకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలి

  • సూర్యాపేటకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలి. 

  • సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్….

దిన దిన అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

 శనివారం సూర్యాపేట పట్టణంలోని కృష్ణ టాకీస్ ఏరియాలో సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజధానులైన  హైదరాబాద్ -విజయవాడ మధ్యలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం  వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉందన్నారు. సూర్యాపేటకు రైలు మార్గం రావడం మూలంగా  సూర్యాపేట ఎంతో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందన్నారు. 

మొదటినుండి సూర్యాపేట వర్తక,వ్యాపార, వాణిజ్య కేంద్రంగా వీరాజిల్లుతుందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా సూర్యాపేటకు రైలు మార్గం కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నప్పటికీ పాలకులు ఎవరైనా సూర్యాపేటకు రైలు మార్గం తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రం పట్ల సూర్యాపేట జిల్లా పట్ల ఏమాత్రం గౌరవం ఉన్న సూర్యాపేటకు రానున్న రైల్వే బడ్జెట్ లో రైలు మార్గం ఏర్పాటు చేయాలన్నారు. గత 20 సంవత్సరాలుగా కేవలం  సూర్యాపేట జిల్లా కేంద్రం కు  రైలు మార్గం ప్రతిపాదనలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది తప్ప ఆచరణలో నేటికీ అమలు కాలేదు అన్నారు.

 సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైలు మార్గం తీసుకొచ్చేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ఆందోళన నిరసన కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. సూర్యాపేటకు రైలు మార్గం తీసుకురాకుంటే ఓట్లు అడిగే నైతిక హక్కు బిజెపి పార్టీకి లేదన్నారు.

అధిక ధరలు, సెప్టెంబర్ 11న  సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగేప్రదర్శనలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10 నుండి 17 వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సాయిధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.  ఈ సమావేశంలో సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి ఎలుగూరి గోవింద్, పట్టణ కమిటీ సభ్యులు వల్లపు దాసు సాయికుమార్, మామిడిపుల్లయ్య,మామిడి సుందరయ్య,షేక్ జహంగీర్,శశిరేఖ,పిట్టల రాణి, లక్ష్మి, జానకి రాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

దేశం గర్వించేలా కేసీఆర్ పాలన: బోయినిపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య.

పొంగులేటి శిబిరం లో నయాజోస్