in , , ,

జిల్లాకు 1000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని మంత్రి ఆదేశాలు

suryapet brs
  • ఫలించిన మంత్రి జగదీష్ రెడ్డి కృషి…

  • యూరియా తక్షణ అవసరం పై  మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన జిల్లా కలెక్టర్  

  • తక్షణమే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో చర్చలు
  • జిల్లాకు వెయ్యి మేట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని ఆదేశాలు
  • రైతులకు ఎలాంటి ఇబ్బదులు లేకుండా యూరియా సరఫరా – జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు

సూర్యాపేట జిల్లాలో రైతులకు సరిపడు యూరియా  అందించడం కొరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తీసుకువెళ్లడంతో రైతుల అవసరాలను గుర్తించిన మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి తక్షణమే సూర్యాపేట జిల్లాకు వెయ్యి మేట్రిక్ టన్నుల యూరియా ను కేటాయించారు. ఈ సందర్బంగా రైతులకు ఎలాంటి యూరియా కొరత రానివ్వొద్దని  జిల్లా కలెక్టర్ కలెక్టర్ యస్. వెంకట్రావు కు మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు  రైతులకు  సమస్య రానివ్వకుండా మంత్రి జగదీష్ రెడ్డి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి జిల్లాకు తక్షణమే అవసరమైన యూరియా కేటాయించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. యూరియా కొరత ఉన్న మండలాలకు అవసరాన్ని బట్టి సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు అదైర్యపడొద్దని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

సీఐడీ అధికారులకు చంద్రబాబు నాయుడు లేఖ..!

రూ.31.88 కోట్లుకు గ్రీన్‌ సిగ్నల్‌…ఆమోదం తెలిపిన ప్రభుత్వం