డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పారా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవరణలో బీఎస్పీ నియోజకవర్గ కేడర్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు బి.పరంజ్యోతి హాజరయ్యారు.ఈ క్యాడర్ క్యాంపు కార్యక్రమంలో గ్రామాలలోని నాయకత్వాన్ని పెంపొందించడం తో పాటు కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ఎల్.రాజారావు హాజరయ్యారు.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముందుకు నడుస్తున్న మన పార్టీ బీఎస్పీ జాతీయ 3వ అతిపెద్ద పార్టీ మన బీఎస్పీ పార్టీ కానీ ఇక్కడ మన ఆంధ్ర లో ఓటుకు నోటు తీసుకుని బానిసలుగా బ్రతికే జీవితాలకు అలవాటు పడుతున్నా నా సోదరులను చూసి ఏమి అనలో తెలియని పరిస్తితి ఇప్పటికైనా మార్పు మొదలై బడుగు బలహీనర్గాలు ఏకమైతే 85 శాతం ఉన్న మనము 15 శాతం ఉన్న వారిని అందలము ఎక్కిస్తే ఏమిటి వారికి కులానికి తప్ప వేరే వలక్కు మిగిలేది ఇప్పటి ప్రభుత్వం ఎస్ సి,ఎస్ టి,బి సి,మైనారిటీ నిధులను మార్పు చేసి ఓ సి వాళ్ళకి కార్పొరేషన్ పేరు చెప్పి పంచుతుంటే ఆ పార్టీ లో ఉన్న మన సోదరులకు అర్దం కావడం లేదా అని ప్రశ్నిస్తున్న ఇంకెన్నాళ్ళు బానిస బ్రతుకులు రాజ్యాధికారం మనమే తెచ్చుకుని మంచి రాజ్యాంగాన్ని అమలుపరుద్దం అని పిలుపునిచ్చారు.అమాయకపు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆలాంటి వారికి ఘన స్వాగతం పలుకుతారు ప్రపంచం మొత్తం పూజించే బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగింది అని ప్రశ్నించినందుకు 18 మంది అమాయకులు దేశ ద్రోహం చట్టం కింద కేసులు ఇంకెన్నాళ్ళు ఇలా తిరగబడే రోజు రానంత వరకు ఇలానే ఉంటుంది తప్పులు వారు చేస్తే శిక్షలు మనకు ఇకనైనా ఇలాంటి కుట్ర పార్టీ లను విడిచిపెట్టి అంబేడ్కర్ ఆశయ సాధనలో నడుస్తున్న మన బీఎస్పీ పార్టీ లో నడవండి అని అన్నారు.ఓట్లు మావి సీట్లు మివ ఇక చెల్లదు అని అన్నారు.యువత ముందుకు రావాలి సమాజంలో జరుగుతున్న చెడును తుడిచి వెయ్యాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గోపాలపురం 18 బాధితుల్లో ఇద్దరు ముషిందర్,విజయ్ కుమార్ బీఎస్పీ కండువా కప్పుకుని బీఎస్పీ లో చేరుతున్నట్లు ప్రకటించారు.వీరితో పాటు నాని,అర్జునరావు,శ్రీను,రమేష్ బాబు, తదితరులు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి అధ్వర్యంలో బీఎస్పీ పార్టీ లో జాయిన్ అవరని కొత్తపేట నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు కొత్తియ్య తెలిపారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు నియోజకవర్గ నాయకులు బీఎస్పీ పార్టీ అభిమానులు అంబేద్కర్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]