డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో వాడపాలెం గ్రామంలో వేంచేసి వున్న గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ మారెమ్మ అమ్మవారు ఆలయం పునర్నిర్మాణం కోసం నేడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామస్థులు సమక్షంలో ఆలయ శంకుస్థాపన చేసిన, అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్న జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్, గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంది అలానే మా గ్రామానికి మారెమ్మ అమ్మవారు వచ్చారు.కోరికలు నెరవేర్చే తీర్చే తల్లి మా మారెమ్మ నూతన ఆలయానికి శంకుస్థాపన లో పాల్గొనడం జన్మ జన్మల పుణ్యఫలం అని అన్నారు
[zombify_post]