సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ
ఆదోని పట్టణములోని అమరావతి నగర్ కాలనీలోని బెరాకా ప్రార్థనా మందిరములో పాస్టర్ ఆశీర్వాదం అధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మన దేశములో అన్ని కులాలు, మతాలు సమానంగా గౌరవించబడతాయని, భగవద్గీత , ఖురాన్ మరియు బైబిల్ గ్రంధం ఏదయినా,మతము ఏదయినా అందరము కలిసి మెలిసి పండుగలు జరుపుకుంటారు,సోదర భావంతో భారతీయులు ఉంటారు కాబట్టే భారతదేశ ఔన్నత్యాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా భారతీయులు ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడుతున్నారని, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన, ఖురాన్ లో అల్లా చెప్పిన, బైబిల్ లో ఏసు క్రీస్తు చెప్పిన మానవులు అహింసను విడనాడి, భారతీయులందరూ సన్మార్గములో నడవాలనే చెబుతాయి కాబట్టి మనందరమూ మత గ్రంథాలలో చెప్పిన మంచిని గ్రహించి సర్వమత సమానత్వాన్ని పాటిస్తూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటుకుందామని లలితమ్మ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో పాస్టర్ ప్రభాకరరావు, శాంతమ్మ, బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భాషా,వెల్లాల మధుసూదనశర్మ, శ్రీరాములు, మధు, మొదలైన వారందరూ పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!