కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారునికి నేరుగా అందే విధంగా విధులు నిర్వహించాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారథి రెవెన్యూ సిబ్బందికి సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, వీఆర్వో, విలేజ్ సర్వేర్ల సమావేశం తాసిల్దార్ హసీనా సుల్తాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట్లాడుతూ విధుల పట్ల నిబద్ధతతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఏలాంటి రాజకీయ ఒత్తుళ్లకు తలగకుండా విధులు నిర్వహించి రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. భూముల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రుద్ర గౌడ్, వలీ భాష, రమేష్ రెడ్డి, విఆర్వోలు, గ్రామ సర్వేలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!