అభయం శుభయము తెలియని చిన్నారి మహిళ వాసంతి పై దాడి చేసి హత్యకు గురిచేసిన దుండగులను బహిరంగంగా ఉరిశిక్ష విధించి రాష్ట్ర మహిళ హోమ్ మినిస్టర్ మాట నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిడ్డమ్మ గారు మరియు శ్రావణి గారు రాష్ట్ర ప్రభుత్వాన్నికి డిమాండ్ చేశారు.
గురువారం స్థానిక ఏఐవైఎఫ్ కార్యాలయము నందు ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమైక్య జనరల్ బాడీ సమావేశం గోవిందమ్మ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాజీ కార్పొరేటర్ గిడ్డమ్మ గారు,శ్రావణి రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ…
బాలికను హతమార్చిన ముగ్గురు దుండగులను తెలంగాణ పద్ధతి ప్రకారం వారిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని లేదా ఉరి శిక్ష విధించి రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమాలలో ఎలాంటి కోతలు విధించకుండా పూర్తిగా స్థాయిలో సంక్షేమ పథకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ పథకంలో భాగంగామహిళల కోసం నెలకు 1500 రూపాయలకు ఇస్తామని ఓట్లు దండుకున్న తర్వాత వారికి పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఉండాలని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు తక్షణమే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే అజయ్ బాబు సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ జిల్లా సమితి సభ్యులు టి వీరేష్ సహాయ కార్యదర్శి విజయ్ లక్ష్మీనారాయణ ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ గిరిమలప్ప అంజిత్ గౌడ్ మహిళా సమాఖ్య నాయకులు కోటమ్మ మాణిక్యమ్మ అన్నమ్మ యు గాంధీనగర్ శంకర్ నగర్ అంబేద్కర్ నగర్ సి ఆర్ నగర్ మహిళా సమాఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
This post was created with our nice and easy submission form. Create your post!