ఆదోని కూటమిలో కొమ్ములాటలు.. వైరల్ గా మారిన వీడియో…
ఎన్నికల్లో కష్టపడిన టిడిపి నాయకులను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని ప్రశ్నించారు నాయకులు. ఎన్నికల ముందు 10% శాతం నేనే అయితే 90% మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే అని చెప్పిన పార్థసారథి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కూటమి పల్లకి మోసిన బాధితుడు TNTUC కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ మల్లికార్జున ఏకంగా కూటమి పల్లకి మోసి మోసపోయిన కార్యకర్త బాధితుల ఐక్యవేదిక విన్నపం ఏమనగా అని ఎమ్మెల్యేను పార్థసారధిని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్…గౌరవ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారికి.. కూటమి పల్లకి మోసి మోసపోయిన కార్యకర్త బాధితుల ఐక్యవేదిక విన్నపం ఏమనగా మీరు చెప్పిన మాటలకు ఎంతో మంత్రముగ్ధులై గత అరాచక పాలకులకు ప్రాణాలు అడ్డంగా పెట్టి మీరు చెప్పిన దానికంటే మీ గెలుపు కోసం ఎంతో కృషి చేశాం మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని పూర్తిగా మరిచిపోయారు మీరు వెంటనే స్పందించి ఐక్యవేదిక హక్కులను నెరవేర్చాలని కోరుతున్నాం మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే మా యొక్క న్యాయపరమైన హక్కుల కోసం ధర్మ పోరాటాలకు అంచలంచెలుగా సిద్ధమవుతాం..హక్కులు..
1వ హక్కు మే 13 వరకు నీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి మాత్రమే కృతజ్ఞత సభ
2 వ హక్కు మే 13 వరకు నీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి మాత్రమే పాలనలో భాగస్వామ్యం ప్రాధాన్యత
3 వ హక్కు మీరు ఇచ్చిన వాగ్దానాలు అములకు & ఐక్యవేదిక బాధితులకు కమిటీ
కూటమి పల్లకి మోసిన బాధితుడు TNTUC కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ మల్లికార్జున..ఇంకొక టిడిపి నాయకుడు పెట్టిన మెసేజ్.. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారధి గారు నేను 10 శాతం మాత్రమే ఎమ్మెల్యే 90 శాతం మీనాక్షి నాయుడు గారు ఎమ్మెల్యే అని చెప్పిన మాటలు ఏమయ్యాయి ఇప్పుడు మాత్రం మీరు మాత్రమే ఎమ్మెల్యే అది వాస్తవమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఎన్నిక అయితే వారు మాత్రమే ఎమ్మెల్యే కానీ మీరు ఎన్నికల సమయంలో అనేక విధంగా మాట్లాడి ఇప్పుడు మాత్రం కూటమి నాయకులను పట్టించుకోకపోవడం ఏమిటని ఆదోని ప్రజలు చర్చించుకుంటున్నారు మరి దీనికేం సమాధానం చెబుతారు ఎమ్మెల్యే సార్.. అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!