నూతన ప్రభుత్వం ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారంకు కృషి చేయాలి…ఎస్టీయూ
*పీఆర్సీలో న్యాయం చేయాలి…ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షులు సి.నాగరాజు
*డిఎస్సీ ఉపాధ్యాయులు నియామకాల్లో అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి…ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ జి.వీరచంద్ర యాదవ్
మున్సిపల్ పాఠశాలలో
డిఎస్సీలో విద్యార్థులు సంఖ్య ఆధారంగా పోస్టులు మంజూరు చేయాలి…ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వి.రమేష్ నాయుడు
నిబంధనలు మేరకు ఏమైనా ఉపాధ్యాయులు సర్దుబాటు చేయాలి…ఎస్టీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్.భీమరాజు
గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ విషయంలో
చాలా అన్యాయం జరిగిందని, దాన్ని రానున్న పీఆర్సీలో సవరించి న్యాయం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సి.నాగరాజు, రాష్ట్ర కౌన్సిలర్ జి.వీరచంద్ర యాదవ్,జిల్లా ఉపాధ్యక్షుడు వి.రమేష్ నాయుడు,పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్.భీమరాజు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఆర్.ఆర్.కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో పట్టణ అసోసియేట్ అధ్యక్షుడు సి.వీరేష్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో పురపాలక పాఠశాలల సభ్యత్వ నమోదు లో భాగంగా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ నాయకులు సి.నాగరాజు,జి.వీరచంద్ర యాదవ్,వి.రమేష్ నాయుడు,ఎస్.భీమరాజు మాట్లాడుతూ ఉద్యోగులతో ప్రభుత్వం పర స్పర సహకార ధ్వనిని అవలంభించాలన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేసిందన్నారు. పీఆర్సీని ప్రకటించేలోగా • ఐఆర్ ను 30% ప్రకటించాలన్నారు,డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని,మునిసిపల్ పాఠశాలలో విద్యార్థులు సంఖ్య ఆధారంగా డిఎస్సీలో పోస్టులు మంజూరు చేయాలని ,అలాగే ఉపాధ్యాయులు సర్దుబాటు నిబంధనలు అనుగుణంగా చేయాలని,ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులతో సత్వరమే – సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వాస్తవ రూపాన్ని తెలుసుకో వాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు శ్రీనివాసులు,జంబులయ్య,అబీదా బేగం,అహ్మద్ హుస్సేన్ శ్రీరాములు,జయరాం తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!