*ఎస్టీయూ వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయండి…..*
కర్నూల్ లో జనవరి12,13 తేదీల్లో జరిగే ఎస్టీయూ వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సి.నాగరాజు,రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జి.వీరచంద్ర యాదవ్,జిల్లా ఉపాధ్యక్షుడు వి.రమేష్ నాయుడు పిలుపునిచ్చారు…స్థానిక ఆదోని పట్టణంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వజ్రోత్సవాల్లో భాగంగా తేదీ 04-01-2024 నుండి 06-01-2024 వరకు ఒక లక్ష మొక్కలు నాటలని, అన్ని జిల్లాల్లో తేదీ జనవరి 4 నుండి 6 వరకు లక్ష మొక్కలు నాటాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఆదోని పట్టణంలోని పాఠశాలల్లో దాదాపుగా 100 మొక్కలు నాటడం జరిగింది… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని పురపాలక చైర్మన్ బి.శాంత గారు పాల్గొన్నారు… తదనంతరం ఆర్.ఆర్.కాలనీ మునిసిపల్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో మరియు సంతపేట బాయ్స్,సంతపేట గర్ల్స్,అర్దగేరి బసవన్న గౌడ్,అండర్ పేట మునిసిపల్ పాఠశాలల్లో మొక్కులు నాటడం జరిగింది… తదనంతరం ఎస్టీయూ నాయకులు సి.నాగరాజు,వి.రమేష్ నాయుడు,జి.వీరచంద్ర యాదవ్ మాట్లాడుతూ విద్యారంగ సేవలు ఆత్మాభిమనమే నినాదంగా నిజాం నిరంకుశపాలను ఎదురించి ఆధ్వర్యంలో జూన్ 9 ,1947 న ఎస్టీయూ ఉద్బవించి చిన్నారుల బంగారు భవిష్యత్తు కి పాటుపడుతూ ఉపాధ్యాయుల ప్రయోజనాలు,ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తూ సమస్యల సాధనలో తొలి పిఆర్సి సాధన నుండి అకుంఠిత దీక్షతో అప్రెంటిస్ వెట్టచాకిరి నుండి విముక్తి పొందగలిగామన్నారు.. హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్ నుండి ఎస్టీయూ ఏపీగా అడుగడుగున ప్రత్యేకతను చాటుకుంటూ, బాధ్యతలకు నిలబడుతూ హక్కులకు కలబడుతూ రాజిలేని మార్గన పురోగమిస్తూ గత వైభవాన్ని కమ్యూనిస్టు గత వైభవాన్ని స్మరిస్తూ మహా నాయకుల త్యాగనిరతిని అని పిలుచుకొని వర్తమానాన్ని పరిరక్షి పరీక్షిస్తూ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా నిర్మించే లక్ష్యంతో మనమంతా సంఘ సేవకు పునరాంకితమవుతున్న గొప్ప చరిత్రాత్మక సందర్భమన్నారు….ఈ కార్యక్రమంలో ఎస్టీయూ పట్టణ అధ్యక్షుడు కె.రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్.భీమరాజు, ఎస్టీయూ నాయకులు జంబులయ్య,వీరేష్, గురురాజా,రాముడు,నాగేష్,గంగ నాయక్,భాస్కర్ ఆచారి,జయరాం,నిరంజన్ రెడ్డి,శ్రీరాములు,వెంకట రామి రెడ్డి,అబీదా బేగం,రాజ్యలక్ష్మి,పద్మావతమ్మ,ఇందిరా ప్రియాంక,ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు….
This post was created with our nice and easy submission form. Create your post!