*వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే*
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్స్‌ను తీసుకొస్తోంది వాట్సాప్. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
తాజాగా వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్ కావాలంటే ఫోన్ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే. ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారానే వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉండేది. అయితే ఇకపై ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే వాట్సాప్ ఖాతాలోకి లాగిన్ అయ్యే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మెయిల్ వెరిఫికేషన్ ద్వారా వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యే ఫీచర్‌ను పరిచయం చేయనుంది.
ఇప్పటి వరకు కొత్త ఫోన్‌లో వాట్సాప్ లాగిన్ చేయాలంటే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండేది. ఇందుకోసం 6 అంకెల ఓటీపీ మెసేజ్ ఫోన్‌కు వస్తుంది అయితే ఒకవేళ ఫోన్ పనిచేయకపోయినా, నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా ఓటీపీ రాదు. దీనికి అల్టర్‌నేటివ్‌గా వాట్సాప్ లాగిన్ కోసం ఈ మెయిల్ వెరిఫికేషన్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు.
వాట్సాప్ ఈ-మెయిల్ వెరిఫికేషన్ కోసం యూజర్లు ఫోన్ నెంబర్‌కు బదులుగా తమ మెయిల్ ఐడీని టైప్ చేయాలి. వెంటనే మీ మెయిల్ ఐడీకి వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. మెయిల్‌ను ఓపెన్ చేసిన ఐడీని వెరిఫై చేయాలి. వెంటనే వాట్సాప్ అకౌంట్ లాగిన్ అవుతుంది. వాట్సాప్ మెయిల్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించే ఈమెయిల్ ఐడీ వివరాలలు ఇతరులకు ఎవరికీ కనిపించవు. ఇదిలా ఉంటే ఈ ఫీచర్‌తో పాటు ఆడియో, వీడియో కాల్స్ సమయంలో యూజర్ల లొకేషన్, ఐపీ అడ్రస్ వవరాలు అవతలి వాళ్లకు తెలియకుండా ప్రొటెక్షన్ ఫీచర్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
This post was created with our nice and easy submission form. Create your post!