కొటారుబిల్లి కూడలి నుంచి పెదవేమలి గ్రామానికి వెళ్లే రహదారిలో నాలుగు చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని, వీటి కారణంగా ప్రమాదాలు సంభవిస్తు న్నాయని మురపాక సర్పంచ్ ఈదుబిల్లి రమేష్ మండల సర్వసభ్య సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు.గంట్యాడ: కొటారుబిల్లి కూడలి నుంచి పెదవేమలి : గ్రామానికి వెళ్లే రహదారిలో నాలుగు చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని, వీటి కారణంగా ప్రమాదాలు సంభవిస్తు న్నాయని మురపాక సర్పంచ్ ఈదుబిల్లి రమేష్ మండల సర్వసభ్య సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పీరుబండి హైమావతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఈ సమస్యను ఆయన ఎమ్మెల్యే అప్పలనర్సయ్య దృష్టికి తీసుకు వెళ్లారు. అలాగే లక్కిడాం నుంచి వసంత గ్రామానికి వెళ్లే రహదారిలో కల్వర్టులు దెబ్బతిన్నాయని లక్కిడాం పీఏసీఎస్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి కృష్ణ చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వెంటనే ఆర్అండ్ బీ ఈఈతో ఫోన్లో మాట్లాడారు. మండలం లోని పలు గ్రామాలో రహదారి సమస్యలు ఉన్నాయని, దీనిపై ఆర్అండ్ అధికా రులు, హైవే అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. తాటిపూడి నుంచిమదుపాడ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిన్నా విశాఖ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని మదుపాడ సర్పంచ్ కిలపర్తి శ్రీరాంమూర్తి ఎమ్మెల్యే తీసుకుని వచ్చారు. దీనిపై విశాఖ జీవీఎంసీ అధికారులతో మాట్లాడుదామ ని ఆయన చెప్పారు. అనంతరం పీఆర్ జేఈ కృష్ణ మాట్లాడుతూ మండలంలోని 21 ఆర్బీకేలు మంజూరు చేస్తే 11 పూర్తయ్యాయని, 17 వెల్నెస్ సెంటర్లు మంజూరు చేస్తే 5 పూర్తి చేశారని, ఆరు భవనాలు ఇంకా ప్రారంభం కాలేదని వివరించారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ వెల్నెస్ సెంటర్లు నిర్మించ కపోతే ఆరోగ్య సురక్ష శిబిరాలు ఎక్కడ నిర్వహిస్తామని, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను సభ్యులు లేవనెత్తారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు వర్రి నర్సింహమూర్తి, ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాలునాయుడు, వైస్ ఎంపీపీ కిలపర్తి వెంకటలక్ష్మి, ఎంపీడీవో భవాని, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!