గురు న్యూస్ విశాఖపట్నం : మద్యపాన నిషేధం పై జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు టీడీపీ మహిళ రాష్ట్ర కార్యదర్శి వంగళపూడి అనిత. విశాఖపట్నం పార్టీ కార్యాలయం లో ఆమె మాట్లాడుతూ జగన్ ని ఉద్దేశిస్తూ తాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని. మద్యన్ని ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని. ఈ నిషేధం ని దశల వారీగా చేస్తానని అది చేసిన తర్వాతనే ఓట్లు అడగడానికి వస్తానని, ఇది ఏ సినిమా డైలాగులో త్రివిక్రమ్ గారు రాసిన డైలాగులు కాదని సాక్షాత్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలని పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్లి తలలు నిమరి ముద్దులు పెట్టి హగ్గులు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కానీ మద్యపాన నిషేధం అమలు చేయలేదని ప్రజలందరిని మోసం చేశారని వంగళపూడి అనిత సంచలన వాఖ్యలు చేసింది.
This post was created with our nice and easy submission form. Create your post!