డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
సిబిఎన్ అంటే చిన్నారుల భవిష్యత్తు అని చిన్నారులు సైతం చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలియజేశారు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెం నందు కొత్తపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం పాటుపడే చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమ కేసులతో అరెస్టు చేశారని తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు పై వున్న కేసులను ఉపసంహరించుకోవాలని చిన్నారులు కోరారు. ఈసందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని చంద్రబాబు నాయుడుని జైలులో పెట్టడంతో జగన్మోహన్ రెడ్డిని బాలలు సైతం చీదరించుకొంటున్నారని అన్నారు.
ఈకార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ మరియు కొత్తపేట మండల టీడీపీ నాయకులతో పాటు రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!