పాడేరు, అక్టోబర్ 04:- రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ దిశగా నడిపించటానికి ముఖ్యమంత్రి తీసుకున్ననిర్ణయమే జగనన్న ఆరోగ్య సురక్ష అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మాత్యులు విడదల రజని పేర్కొన్నారు. అరకు నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ గిరిజన సంక్షేమ పాటశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష ప్రత్యెక వైద్య శిభిరంను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ, నాణ్యమైన, మెరుగైన వైద్యాన్ని ప్రతి ఇంటికీ అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి ఇంతినీ జల్లెడ పట్టి దీర్ఘ కాలిక రోగులను గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు చేసి చికిత్స అందించటం జరుగుతోందని, వారికి అవసరమైతే కార్పోరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఉచిత చికిత్సలు అందించటం జరుగుతుందని వివరించారు. అంటే కాకుండా నిత్యం వారిని ట్రాక్ చేయడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ వైద్య శిభిరానికి 6200 ఇళ్ళను సందర్శించి 6200 మందికి పరీక్షలు నిర్వహించి 2450 మందికి స్క్రీనింగ్ చేయటం జరిగిందని, అందులో 440 మందికి చికిత్సలు అందించటం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 297 క్యాంపులు జరుగుతాయని, 211 మంది ప్రత్యెక వైద్య నిపుణులు సేవలన్దిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,574 వైద్య శిభిరాలు ఏర్పాటుకు నిర్ణయించగా ఈ మూడు రోజుల్లో 1237 వైద్య శిభిరాలు నిర్వహించి సుమారు 12 వేల మందికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేయటం జరిగిందని తద్వారా ప్రభుత్వం వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుందని వెల్లడించారు. అంటే కాకుండా విశాఖపట్నం కే.జి.హెచ్ అభివృద్ధితో పాటు అక్కడ ఉన్న ట్రైబల్ సెల్ ను కూడా బలోపేతం చేయడం జరిగిందని, పాడేరు మెడికల్ కళాశాలను రూ.500 కోట్లతో నిర్మాణం పనులు షరా వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది నుండి క్లాసులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేసారు. అది పూర్తయితే రిఫరల్ కు కెజిహెచ్ కు వెళ్ళే ఆవసరం ఉండదని తెలిపారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గిరిజనులకోసం నూతంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేయటం గొప్ప
విషయమని, అందువల్ల ప్రతి విషయాన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించి అభివృద్దికి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. మిషన్ కనెక్ట్ పాడేరు కింద 1700 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బాక్సైట్ రద్దు చేస్తూ జి.ఓ 97 విడుదల చేయటం జరిగిందని గుర్తు చేసారు. గిరిజనుల ఆరోగ్యానికి భారోశా కల్పిస్తూ ముఖమంత్రి అనేక చర్యలు తీసుకున్నారని, అందులో భాగంగా అల్లూరి జిల్లాకు 20 104 వాహనాలు, మరో 20 108 వాహనాలు కేటాయించటం జరిగిందని తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించటానికి బర్త్ వెయిటింగ్ హాలులను ఏర్పాటు చేసారని, వీటిని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాస్లని సూచించారు. అరకు శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ విజ్ఞప్తి మేరకు ప్రాంతీయ ఆసుపత్రిలో త్వరలోనే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడి స్థానిక బాష తెలిసినవారు వైద్యులతో మాట్లిడితే మరింత మెరుగైన సేవలు అందుతాయని ఎంఎల్ఎ చేసిన విజ్ఞప్తి మేరకు అటువంటి సమస్య లేకుండా చూస్తామని, అవసరమైతే స్థానిక బాషలో శిక్షణ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.
కుటుంభ సంక్షేమ శాఖ కమిషనర్ జే. నివాస్ మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాలలో అందుతున్న వైద్యానికి సమానమైన వైద్యం గిరి ప్రాంతాలలో కూడా అందాలన్న సంకల్పంతో ఏడు రకాల ప్రత్యెక వైద్య నిపుణులతో వైద్య శిభిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవటానికి ముందుకు రావాలని, డాక్టర్ల సలహాలు, పాటించి ఆరోగ్యం మెరుగు పరచుకోవాలని పిలుపు నిచ్చారు.
ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి గిరిజనులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప సంస్కరణే జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పారు. ఇప్పటివరకు 34500 మందికి పరీక్షలు నిర్వహించి ఐదు వేల మందిని రిఫరల్ ఆసుపత్రులకు పంపించటం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రతి మారు మూల ప్రాంతం నుండి కనీసం 2.50 లక్షల మందికి వైద్య శిభిరాల ద్వారా సేవలు అందించటానికి కృషి చేస్తున్నామన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ జే. సుబధ్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి గొప్ప ఆలోచనతో ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించి సకాలంలో సరైన మందులు అందించి ప్రజలను సురక్షితంగా ఉంచటంతో పాటు వారి ఆరోగ్యానికి భారోష కల్పించటం సంతోషకరమన్నారు.
స్థానిక అరకు శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ, విద్య, వైద్య, ఆరోగ్యం, రవాణా, కమ్యునికేషన్ రంగాలకు అగ్ర తాoభూలమిస్తూ ముఖ్యమంత్రి గిరిజనుల పట్ల ప్రత్యెక ఆదరణ కూరిపిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సమస్యలపై జల్లెడ పట్టి ఈ శిభిరానికి 1250 మందిని గుర్తించటం జరిగిందన్నారు. ఆరోగ్యంగా ఉంటే అన్ని పధకాలు పొందవచ్చని, అటువంటి ఆరోగ్యాన్ని ఉచితంగా అందించటానికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నానికి అందరం అండగా ఉండాలన్నారు. రూ.908 కోట్లతో నాడు- నేడు కింద ఆసుపత్రులు అభివృద్ది చేయటం జరిగిందని, రూ.650 కోట్లతో 317 రోడ్లను మారుమూల ప్రాంతాలకు కూడా నిర్మించటం జరిగిందని వివరించారు.
పాడేరు శాసన సభ్యులు కే. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాలలో అవగాహనా లోపంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయని, వైఎస్ఆర్ కాలంలో హెల్త్ ఎమర్జెన్సీ కూడా పెట్టారని గుర్తు చేసారు. ఆ నేపధ్యంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రూ. 500మ కోట్లతో మెడికల్ కాలేజి మంజూరు చేసారని, ఆరోగ్య కేంద్రలను ఉన్నతీకరించారని, పూర్తీ స్థాయి ప్రత్యెక వైద్యులను కేటాయించారని తెలిపారు. గిరిజనుల రక్త హీనతపై ప్రత్యెక ద్రుష్టి సారించి మాతా శిశు మరణాలకు చర్యలు తీసుకోవటంలో భాగ౦గా సంపూర్ణ పోషణ ప్లస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో జరిగే దురద్రుష్ట సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవటంతో పాటు ఆరోగ్య ఆంద్ర ప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు.
కార్యక్రమంలో భాగంగా వైద్య శిభిరంలో అందిస్తున్న అన్ని సేవలను మంత్రి పరిశీలించారు. జగననన్న ఆరోగ్య సురక్ష కిట్లను పంపిణీ చేసారు. అంగన్వాడి ఆద్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రామిరెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. హేమలత, డిఎంహెచ్ఓ డా. సి. జమాల్ బాష, ఎఎస్పీ ధీరజ్, మెడికల్ బోర్డు సభ్యులు డా.టి. నరసింగ రావు, స్థానిక సర్పంచ్ శారదా దేవి, పలువురు ఎంపిపిలు, ఎంపిటిసిలు,, జెడ్ పిటిసిలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!