in , , ,

రైళ్లలో జనరల్ బోగీలను పెంచండి

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు స్లీపర్‌, జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఢిల్లీలో రైల్వేబోర్డు చైర్‌పర్సచన్‌ జయవర్మ సిన్హాకు వినతిపత్రం అందజేశారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వేలాదిమంది ప్రయాణికులు రాక పోకలు సాగిస్తుంటారు. భువనేశ్వర్‌- సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పది స్లీపర్‌కోచ్‌లు ఉండేవి. వాటిని కుదించడంతో సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్‌, జనరల్‌ బోగీలు పెంచాలి.

వందేభారత్‌ సెమీ హైస్పీడ్‌ రైలును భువనేశ్వర్‌-విశాఖ మధ్య నడపాలి. శ్రీకాకుళంలో హాల్ట్‌ కల్పించాలి. దీనివల్ల ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడతాయి. భువనేశ్వర్‌, పలాస మధ్య రాకపోకలు సాగిస్తున్న మెమూ రైళ్లను శ్రీకాకుళం వరకు పొడిగించాలి.విశాఖ- పలాస మెమూ రైళ్లను ఇచ్ఛాపురం వరకు నడపాలి. హౌరా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఇచ్ఛాపురంలో నిలపాలి. రౌర్కెలా-గుణుపూర్‌ రాజా-రాణి ఎక్స్‌ప్రెస్‌కు టెక్కలి, పాతపట్నంలో, భువనేశ్వర్‌-రామేశ్వరం రైలుకు శ్రీకాకుళం రోడ్డు, పలాసలో హాల్ట్‌లు కల్పించాలి. హౌరా-మైసూర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలుకు శ్రీకాకుళం రోడ్డు నందు, భువనేశ్వర్‌- విశాఖ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు హరిశ్చంద్రపురంలో హాల్ట్‌ కల్పించాల’ని ఎంపీ కోరారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

జనసేన పొత్తు కొనసాగుతోంది – బీజేపీ ఎంపీ

ప్రజాక్షేత్రంలో టిడిపిని ఎదుర్కోవటం చేతకాకే తప్పుడు కేసులు