ఆదోని న్యూస్ :- తుది దశకు ఆరోగ్య సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. శుక్రవారం ఆదోని పట్టణం, మండలంలోని గ్రామాల్లో సర్వే కార్యక్రమం జరిగింది. స్థానిక 35 వ వార్డు పంజరాపోల్ ఏరియాలో ప్రతి ఇంటింటికి వెళ్లి, కౌన్సిలర్ వెల్లాల. మధుసూదన్ శర్మ, డాక్టర్, ఏఎన్ఎం ఎం.ఈరమ్మ, ఆశావర్కర్లు లలిత, నాగవేణి, హెల్త్ సూపర్వై జర్లు సర్వే చేశారు. గడప గడపకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, ఆ కుటుంబంలోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి వివరాలను పక్కాగా సేకరిస్తున్నామని కౌన్సిలర్ వెల్లాల. మధుసూదన్ శర్మ తెలిపారు. పట్టణంలోని 42 వార్డులు, మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో ‘ పట్టణ మున్సిపాలిటీ వార్డులలోనూ జగనన్న ఆరోగ్య సురక్ష’ సర్వే కార్యక్రమం జరుగుతోంది. ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయడం, ఈనెల 17వ తేదీన ఏర్పాటు చేసే వైద్య శిబిరాల్లో వైద్యం అందించడం చాలా గొప్ప విషయమని, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై చూపుతున్న శ్రద్ధ అభి నందనీయమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకుడు రవి, వాలంటీర్లు తబిత, తిమ్మప్ప, వార్డు పెద్దలు గదారం నరసప్ప ,శంకరమ్మ, సులోచనమ్మ , అబ్రహం, తిక్కన్న , కామారం ఈరన్న, అగ్గి రాముడు, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!