*వడ్డే భవ్య శ్రీ చావుకు కారణమైనటువంటి నలుగురు వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించాలి. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు***
ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదోనిస్థానిక కార్యా లయంనందు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమా వేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి చిత్తూరు జిల్లా పెనుమూరు మండల పరిధిలో కావూరిపల్లె పంచాయతీ వేణుగోపాలపురంలో వడ్డే భవ్య శ్రీ అనేమై నర్ బాలికను 17వ తారీఖున నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి నాలుగు రోజులుగా ఆ నలుగురు మానవత్వం లేకుండా అతికిరాతకంగా హింసించి మాన భంగం చేసి అంతటితో వదలకుండా శాడిజం తో ఆ అమ్మాయి జుట్టు, కనుబొమ్మలు, అంతా వెంట్రుకలు లేకుండా చేసి దారుణంగా చంపేసి గ్రామ చివర్లో ఉన్నటువంటి బావిలో మృతదేహాన్ని పారవేసి, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి, ఇంతటి ఘాతుకానికి పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే ఆరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడమైనది. ఈ సమావేశంలో ఆదోని తాలూకా అధ్యక్షులు మరియా ని చెన్న బసప్ప, అధ్యక్షులు డాక్టర్ వీరేష్ , తాలూకా గౌరవ సలహదారులు దేవిశెట్టి ప్రకాష్, పట్టణ గౌరవ సలహాదారులు బి. రాముడు,బి మల్లేశ్వరప్ప, మాల మహానాడు కుంకనూరు వీరేష్, కన్నే జగదీష్ తది తరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!